Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాట్ ఏ గయ్ ❤ : భర్తపై అనుష్కశర్మ కాంప్లిమెంట్స్

  • తొలి వన్డేలో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్
  • ఫిదా అయిన అనుష్క శర్మ
  • సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసిన అనుష్క
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తన వన్డే కెరీర్లో 33వ సెంచరీని సాధించడమే కాక, ఇండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. కఠినమైన పిచ్ పై కోహ్లీ ఆడిన తీరుపట్ల అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

మరోవైపు తన భర్త అద్భుత ఇన్నింగ్స్ కు కొత్త పెళ్లికూతురు అనుష్క శర్మ ఫిదా అయింది. తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. సెంచరీ సాధించిన తర్వాత కోహ్లీ విజయగర్వంతో ఉన్న ఫొటోను పెట్టి... దానిపై 'వాట్ ఏ గయ్ ' అని రాసింది.
.
Virat Kohli
Anushka Sharma
Bollywood
team india

More Telugu News